కరోనా కారణంగా సినిమా థియేటర్లు పూర్తిస్ఖాయిగా జనంతో నిండట్లేదు. ప్రస్తుతం ఓటీటీ కల్చర్ నడుస్తోంది. దీంతో మొబైల్ ఫోన్లు, ఇంటి టీవీల్లో సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ తన సబ్‌స్క్రిప్షన్ ధరలు తగ్గించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఓటీటీ రంగంలో నెలకొన్న పోటీయే నెట్ ఫ్లిక్స్ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్లలో నెట్ ఫ్లిక్స్ వీక్షించేందుకు ఇకపై నెలకు రూ.149 చెల్లిస్తే చాలు. ఇంతకుముందు అది రూ.199 ఉండేది.
అదే సమయంలో టీవీలో నెట్ ఫ్లిక్స్ వీక్షించేవారికి ఎంతో వెసులుబాటు కలగనుంది. బేసిక్ ప్లాన్ ధర గతంలో రూ.499 ఉండగా, ఇప్పుడు దానిని రూ.199కి తగ్గించారు. గతంలో స్టాండర్డ్ ప్లాన్ రూ.649 ఉండగా, ఇప్పుడది రూ.499 అయింది.
అంతేగాకుండా.. ఓటీటీ రంగంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. అమెజాన్ ప్రైమ్ తన సబ్ స్క్రిప్షన్ ధరలు పెంచగా, నెట్ ఫ్లిక్స్ ధరలు తగ్గించింది. అమెజాన్ ప్రైమ్ దాదాపు తన ధరలపై 50 శాతం పెంపు విధించింది.