స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన మోటరోలా నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ నెల 16వ తేదీన మోటో జి64 5జీ స్మార్ట్ ఫోన్ పేరుతో దీన్ని విడుదల చేయనుంది. ఏప్రిల్ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. ఈ ఫోన్ విక్రయాలు ఫ్లిప్‌కార్డ్ మైక్రోసైట్‌ను కూడా క్రియేట్ చేసింది. మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్మార్ట్ ఫోన్స్ విక్రయ షాపుల్లో లభ్యంకానుంది.
ఇకపోతే, ఈ ఫోన్ మోటో జీ64 5జీ బ్లూ, గ్రీన్, పర్పుల్ అనే మూడు రంగుల్లో లభ్యంకానుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలిస్తే, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో తయారు చేశారు. 8జీబీ + 128 జీబీ, 12జీబీ + 256 జీబీ అనే రెండు ర్యామ్, స్టోర్జే కాన్ఫిగరేషన్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది.
ఇక స్మార్ట్‌ఫోన్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.5 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కెమెరా ముందు భాగంలో 50 ఎంపీ ప్రధాన సెన్సార్, 8 ఎంపీ మాక్రో షూటంర్, వెనుకవైపు డ్యుయల్ కెమెరా ఉంటుంది. ఇక 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో రానుంది. కాగా, ఫోన్ ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా బహిర్గతం చేయలేదు.