Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అంటే ఏంటి? ఎలా పరిష్కరించుకోవాలి?

blue screen error

వరుణ్

, శుక్రవారం, 19 జులై 2024 (16:24 IST)
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యల తలెత్తింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌గా పిలిచే ఈ సమస్య శుక్రవారం తలెత్తింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన, బ్యాంకు తదితర రంగాలకు చెందిన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య ఉత్పన్నంకాగానే ఆయా కంప్యూటర్లు స్వతహాగా షట్‌డౌన్, రీస్టార్ట్ కావడం జరిగాయి. 'విండోస్ సరిగా లోడ్ కాలేదు. రీస్టార్ చేయడానికి ప్రయత్నంచండి' అంటూ సందేశం చూపిస్తోంది. ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది.
 
ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రయిక్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్‌లో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్‌డ్ నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు ఆ సర్వీసు అప్‌డేట్ కారణమని క్రౌడ్ స్ట్రయిక్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజినీర్లు పనిచేస్తున్నారని చెప్పింది.
 
బ్లూ స్క్రీన్‌లో కనిపిస్తున్న ఈ ఎర్రర్‌ను బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేదా స్ట్రాప్ కోడ్ ఎర్రర్స్ పిలుస్తారు. దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్‌డౌన్, లేదా రీస్టార్ట్ అవుతుంది. సాధారణంగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్ తలెత్తుతుంటాయి. ఒకవేళ ఇటీవల ఏదైనా హార్డ్‌వేర్‌లు ఇన్‌స్టాల్ట్ చేయడం వల్ల బ్లూ స్క్రీన్ ఎర్రర్ తలెత్తి ఉంటే.. సిస్టమ్‌ను షట్ డౌన్ చేసి, హార్డ్‌వేర్ తొలగించి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తాజా బ్లూస్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సూచించింది.
 
సిస్టమ్‌ను సేఫ్‌మోడ్ లేదా రికవరీ మోడ్‌లో ఓపెన్ చేయాలి. తర్వాత C:\Windows\System32\drivers\CrowdStrike అనే డైరెక్టరీలోకి వెళ్లాలి. అందులో c-00000291*. sys అనే ఫైల్ ఉంటే డిలీట్ చేయాలి. తర్వాత యధావిధిగా సిస్టమ్‌ను బూట్ చేయడం ద్వారా సమస్య పరిష్కారమయ్యే మైక్రోసాఫ్ట్ తెలిపింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్డేట్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రూప్-2 పరీక్షను డిసెంబరుకు వాయిదా వేసిన తెలంగాణ సర్కార్