Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విండోస్ 7 అప్‌డేట్‌లతో సహా సపోర్ట్ కూడా నిలిపివేయబడుతుంది: మైక్రోసాఫ్ట్

విండోస్ 7 అప్‌డేట్‌లతో సహా సపోర్ట్ కూడా నిలిపివేయబడుతుంది: మైక్రోసాఫ్ట్
, శుక్రవారం, 3 జనవరి 2020 (11:27 IST)
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు తమ సపోర్ట్‌ను నిలిపివేయనుంది. గతంలో కూడా విండోస్ ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇదే నిర్ణయం తీసుకుంది. తాజాగా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు అందిస్తున్న ఓఎస్ సపోర్ట్‌ను జనవరి 14వ తేదీ నుండి నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఒక పోస్ట్‌లో పేర్కొంది. దీని ఫలితంగా విండోస్ 7 ఓఎస్‌కు ఎలాంటి అప్‌డేట్‌లు రావనీ ఆ సంస్థ పేర్కొంది. గతంలో విండోస్ ఎక్స్‌పి విషయంలో తీసుకున్న నిర్ణయాన్నే మైక్రోసాఫ్ట్ మళ్లీ అమలు చేయనుంది. 
 
2009 అక్టోబర్ 22న విడుదలైన విండోస్ 7, తక్కువ కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది. విండోస్ ఎక్స్‌పి ఓస్‌ను విండోస్ 7కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిందిగా అప్పుడు వినియోగదారులను కోరింది. అయితే తాజాగా వినియోగదారుల యొక్క కంప్యూటర్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రస్తుతం విండోస్ 7 జెన్యూన్ ఓఎస్‌ను వినియోగిస్తున్న వారు విండోస్ 10కు ఆ ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు అని సంస్థ సూచించింది. అంతేకాకుండా విండోస్ 7 పైరేటెడ్ వెర్షన్‌ను వాడుతున్న వారు మాత్రం విండోస్ 10 ఓఎస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగిక కోరికలతో ఆ మగపులి.. ఆడపులిని ఏం చేసిందంటే?