Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసభ్య - నగ్న చిత్రాల బ్లర్ కోసం కొత్త ఫీచర్ కోసం ఇన్‌స్టా యత్నాలు!!

instagram

వరుణ్

, శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (10:40 IST)
సోషల్ మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. టీనేజర్లు, చిన్నారుల ఆన్‌లైన్ భద్రత దిశగా ఇన్‌స్టా మాతృ సంస్థ మెటా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాలో డైరెక్ట్ మెసేజీల ద్వారా అసభ్య, నగ్న చిత్రాలు పంపించిన సందర్భాల్లో వాటిని బ్లర్ చేసే సాంకేతికతను పరీక్షిస్తోంది. యూజర్లలో మొబైల్ ఫోన్లలో ఉండే ఓ టూల్.. డీఎమ్లలోని చిత్రాలను అప్పటికప్పుడు పరిశీలించి అవసరమనుకుంటే బ్లర్ చేస్తుంది. 18 ఏళ్ల లోపు వారి ఫోన్లలో ఈ ఫీచర్ డీఫాల్ట్ ప్రారంభమై ఉంటుందని, పెద్దలు కూడా దీన్ని యాక్టివేట్ చేసేలా ప్రోత్సహించేందుకు నోటిఫికేషన్లు పంపిస్తామని ఇన్‌స్టా వర్గాలు పేర్కొన్నాయి. 
 
యూజర్ల మొబైల్ ఫోనులోని మెషిన్ లెర్నింగ్ టూల్ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో చిత్రాల పరిశీలన జరుపుతుందని సంస్థ పేర్కొంది. కాబట్టి, ఈ వివరాలు ఇన్‌స్టాకు చేరే అవకాశమే లేదని వెల్లడించింది. ఇన్‌స్టాలో డైరెక్ట్ మెసేజీలకు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మెటా మెసెంజర్, వాట్సాప్‌లో ఈ ఎన్‍‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.
 
టీనేజర్లకు ఇన్‌స్టా ఓ వ్యవసనంగా మారుతోందన్న ఆందోళన అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లోనూ వ్యక్తమవుతోంది. దీనికితోడు సైబర్ నేరగాళ్లు ఈ వేదిక ద్వారా లైంగిక దోపిడీ, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ఇన్‌స్టా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అనేక దేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో అమెరికాలోని 33 రాష్ట్రాల ఎటార్నీ జనరల్స్ ఫేస్‌బుక్‌పై  కేసు పెట్టారు. 
 
ఈ వేదికలతో కలిగే ప్రమాదాలపై సంస్థ ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. చట్టవ్యతిరేక, హానికారక సమాచారం నుంచి చిన్నారులను కాపాడేందుకు మెటా ఏ చర్యలు తీసుకుంటోందో తెలపాలని యూరోపిన్ కమిషన్ కూడా ఫేస్‌బుక్‌ను ఆదేశించిన విషయం తెల్సిందే. దీంతో మెటా ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నం విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు