Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియా ప్రభావం.. వార్తాపత్రికలు చదివేదీ లేదు.. టీవీల్లో వార్తలు చూసేదీ లేదు!

సోషల్ మీడియా ప్రభావంతో వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు చూడటం, న్యూస్ పేపర్లు చదవడం బాగా తగ్గిపోయినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

Advertiesment
Majority Of People Gets News From Social Media Over Newspapers
, గురువారం, 16 జూన్ 2016 (15:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు చూడటం, న్యూస్ పేపర్లు చదవడం బాగా తగ్గిపోయినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు ఫోటోలు షేర్ చేయడం, చాటింగ్ చేయడం వరకే పరిమితమైన సోషల్ మీడియా.. ప్రస్తుతం రోజువారీ అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాపై ఆధారపడే స్థాయికి పెరిగింది. 
 
బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన 26 దేశాల్లోని ఆన్ లైన్ యూజర్లపై చేసిన అధ్యయనంలో ఆసక్తకికరమైన అధ్యయనంలో.. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు వాట్సాప్, స్నాప్ చాట్ తదితర సామాజిక మాధ్యమాల వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందని తేలింది. ఇంకా వార్తలు, తాజా విశేషాల కోసం సోషల్ మీడియా సైట్ల వాడకం విపరీతంగా పెరిగిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
గతంలో కేవలం ఫొటోలు పోస్ట్ చేయడం, చాటింగ్ చేయడానికి మాత్రమే సోషల్ మీడియాను వినియోగించేవారు. కానీ ఆన్‌లైన్ యూజర్లలో సగానికి సగం మంది రోజువారీ వార్తలు, అప్ డేట్స్‌ను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్‌గా ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక సమయం కూడా అక్కర్లేకపోవడంతో సోషల్ మీడియాను ఉపయోగించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని అధ్యయనంలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో జయను జైల్లో పెట్టినా... కరుణను ఈడ్చుకెళ్లినా చూపించారు... ఇక్కడ ముద్రగడ ఆందోళన అంటే 'సాక్షి' కట్టా...?