చైనాకు చెందిన లీఎకో మొబైల్ కంపెనీ భారత్‌లో మరో మూడు రకాల స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనుంది. గత ఏప్రిల్ నెలలో చైనాలో ఆవిష్కరించిన మోడల్స్‌నే భారత్‌లోనూ జూన్ ఎనిమిదో తేదీన జరిగే ఓ కార్యక్రమంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇవి లీ 2, లీ 2 ప్రో, లీ మ్యాక్స్ 2 పేరుతో ఉన్నాయి. గత జనవరిలో భారత మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఈ కంపెనీ... ప్రారంభంలో లీ 1ఎస్, లీ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించి, మే నెలలో 10,899 రూపాయల ధరను నిర్ణయించి విక్రయించింది. ఇపుడు కూడా ఈ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్.. వీటి ధరలను మాత్రం వెల్లడించలేదు.
ఈ ఫోనులోని ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే (లీఎకో లీ మ్యాక్స్ 2)...
ఈ ఫోన్ 5.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 X 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగివుంటుంది. అలాగే, 2.15 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 21 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో పాటు.. డాల్బీ అట్మోస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్-సి, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0తో పాటు.. మరికొన్ని అత్యాధునిక ఫీచర్లను కలిగివుంది.