Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువ 5Gతో లావా యువత కొరకు ఒక పవర్ ప్యాక్ట్ 5G

Lava Yuva

ఐవీఆర్

, శుక్రవారం, 31 మే 2024 (18:55 IST)
ప్రముఖ ఇండియన్ స్మార్ట్‎ఫోన్ బ్రాండ్ అయిన లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అసాధారణమైన వేగము, పనితీరును అందించుటకు రూపొందించబడిన పవర్ ప్యాక్డ్ యువ 5G ప్రారంభాన్ని ప్రకటించింది. రెండు మెమొరీ వేరియంట్స్‌లో ప్రవేశపెట్టబడిన యువ 5G, పెరిగిన బ్యాటరీ బ్యాకప్, మెరుపువేగము, నాణ్యమైన కెమెరా ఫీచర్స్‌తో రోజంతా ఒక మంచి తోడుగా ఉంటుంది. రూ. 9499 (64 GB), రూ. 9999 (129 GB) ధర నిర్ణయించబడిన ఈ యువ 5G జూన్ 5, 2024 నుండి అమెజాన్, లావా ఈ-స్టోర్, లావా రీటెయిల్ అవుట్‎లెట్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
 
ప్రారంభము గురించి మాట్లాడుతూ, శ్రీ. పూర్వాన్ష్ మైత్రేయ, మార్కెటింగ్ హెడ్- లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇలా అన్నారు “లావా వద్ద వినియోగదారుడి ప్రయాణము మా వ్యాపార తత్వములో ఒక అంతర్గత భాగం. ఆవిష్కరణ, ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, సేవల ద్వారా మా వినియోగదారుల కొరకు విలువను తీసుకొనివచ్చే మా నిరంతర ప్రయత్నము. యువ 5G యువత యొక్క వినియోగ ధోరణులు, ప్రాధాన్యతలకు తగినట్లు ఉండేలా తయారుచేయబడింది. ఇందులోని పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ సంపూర్ణ భద్రత మరియు హామీఇవ్వబడిన అప్డేట్స్ తో అపరిమిత అనుభవాన్ని అందిస్తాయి.”
 
ఈ కొత్త యువ 5G గురించి మాట్లాడుతూ, శ్రీ. సుమిత్ సింగ్, ప్రాడక్ట్ హెడ్, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇలా అన్నారు, “మా ఉత్పత్తి ప్రయాణములో ఆవిష్కరణ మరియు ఉత్కృష్టత కీలక అంశాలు. మా వినియోగదారులకు అత్యధిక వేగవంతమైన పనితీరును, కొత్త తరం స్మార్ట్‎ఫోన్ ఫీచర్స్‌ను సరసమైన ధరలకు అందించుటకు యువ 5G రూపొందించబడింది. పవర్ ప్యాక్డ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, డ్యుయల్ AI కెమెరా, వేగవంతమైన చార్జింగ్‌తో ఈ కొత్త యువ 5G యూజర్స్‌కు ఉత్తమ సాంకేతికత, సృజనాత్మకతలను అందిస్తూ ఈ విభాగములో కొత్త బెంచ్ మార్క్స్‌ను సెట్ చేస్తుంది.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో పని చేయని ఏసీ.. 24 గంటల ఫ్లైట్ ఆలస్యం!!