జియో ఫ్రీ ఫోన్‌పై పెదవి విరుస్తున్న టెక్ నిపుణులు...
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెల్సిందే. దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా జియో ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ ఫోన్‌పై టెక్ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ ఫోన్
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెల్సిందే. దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా జియో ఫోన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ ఫోన్‌పై టెక్ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి యాప్‌లు లేకపోవడాన్ని వారు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు... జియో ఉచిత ఫోన్ సెప్టెంబరు నుంచి అందుబాటులోకి రానుంది. ఈ 4జీ ఫీచర్ ఫోన్ దేశాన్ని అత్యంత వేగంగా 4జీవైపు నడిపిస్తుందని టెలికాంరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జియో ఫోన్ అందుబాటులోకి వచ్చిన మరుక్షణం నుంచి 2జీ వినియోగదారులు మొత్తం 4జీ వైపు మళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు చెందిన వినియోగదారులు జియో వైపు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
ముఖ్యంగా దేశంలోని 2 టయర్, 3 టయర్ నగరాల్లోని వినియోగదారులు జియో ఫ్రీ ఫోన్‌వైపు ఆకర్షితులవుతారన్నారు. జియో ఫీచర్ ఫోన్ కోసం వినియోగదారులు తొలుత సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. 36 నెలల తర్వాత ఆ సొమ్మును కంపెనీ తిరిగి వినియోగదారులకు చెల్లించనుంది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాను శాసిస్తున్న ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటివి లేకపోవడ పెద్ద లోటేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.