Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

S 23ను ప్రత్యేకంగా అమెజాన్‌లో రూ. 8799కి విడుదల చేసిన ఐ టెల్

Itel
, శుక్రవారం, 9 జూన్ 2023 (17:10 IST)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన ఐటెల్, దాని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, ఐటెల్ S23 ను సబ్-9కె కేటగిరీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశపు మొదటి 16 GB ర్యామ్ ఫోన్‌ ఇది. మెమరీ ఫ్యూజన్ ద్వారా అత్యధిక ర్యామ్ అందిస్తుంది. మొబైల్ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేస్తూ, ఐటెల్ S 23 16 GB ప్రత్యేకంగా అమెజాన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. ఐటెల్ గత కొన్ని నెలల్లో A 60, P 40 వంటి విప్లవాత్మక ఉత్పత్తులను రూ. 8,000 ఉప విభాగంలో విడుదల చేసి మిలియన్ల మంది హృదయాలను కైవసం చేసుకుంది, ఈ వినూత్న ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తితో ఐటెల్ మునుపెన్నడూ లేని విధంగా సబ్ 10K స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంది. ఈ నూతన స్మార్ట్ ఫోన్ ధర రూ. 8799.
 
ఐటెల్ S23 తమ  విభాగంలో చక్కదనం, పనితీరును పునర్నిర్వచిస్తుంది. అద్భుతమైన సూపర్ క్లియర్ 50 MP వెనుక కెమెరా, ఫ్లాష్‌తో కూడిన ఆకట్టుకునే 8 MP గ్లోయింగ్ AI ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది ప్రతి క్షణాన్ని అత్యుత్తమ స్పష్టత, సూక్ష్మ అంశాలతో సహా ఒడిసిపట్టటానికి S23ని అనుమతిస్తుంది. అదనంగా, ఐటెల్ S 23, 8GB వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది, తద్వారా విస్తృత శ్రేణి వినియోగదారుల అవసరాలను తీర్చనుంది. 
 
ఈ ఆవిష్కరణపై ఐటెల్ ఇండియా సీఈఓ శ్రీ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ, “నేడు వినియోగదారులు చాలా అప్రమత్తతో ఉన్నారు. వారి ఇష్టాలు, ఎంపికలు మరియు ఫ్యాషన్ అంశాల పరంగా తమకు కావాల్సినవి డిమాండ్ చేస్తున్నారు. అదీకాక వినియోగ విధానాలలో సైతం పెద్ద మార్పు వచ్చింది. మొబైల్‌లు ఇకపై కేవలం పరికరాలు మాత్రమే కాదు, కొత్త భారత్‌లో వినోదం, జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. ఐటెల్‌లో మేము అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ మరియు నూతన తరపు సాంకేతికతతో కూడిన ఆవిష్కరణలను తీసుకురావడం ద్వారా మా వినియోగదారులకు సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము" అని అన్నారు. ఈ ఫోన్ స్టార్రి బ్లాక్, మిస్టరీ వైట్ రంగులలో లభ్యమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 12 నుండి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక