Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

5జీ తరంగాలకు కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధం లేదు.. కేంద్రం

5జీ తరంగాలకు కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధం లేదు.. కేంద్రం
, మంగళవారం, 11 మే 2021 (13:44 IST)
5జీ తరంగాలతోనే దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అసలు 5జీ టెక్నాలజీకి, కరోనావైరస్ వ్యాప్తికి మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్రం కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం. నిరాధారమైన సమాచారాన్ని చూసి ప్రజలెవరూ నమ్మొద్దనని టెలికాం విభాగం(డాట్) స్పష్టం చేసింది.
 
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 5జీ నెట్‌వర్క్‌ టెస్టింగ్ చేయడం వల్లే కరోనా వ్యాపిస్తోందన్న వదంతులను డాట్ చెక్ పెట్టేసింది.. అసలు ఎలాంటి టెస్టింగ్ జరగడం లేదు. 5జీ సాంకేతికతకు, కరోనాకు సంబంధమే లేదని డాట్ స్పష్టంచేసింది. మొబైల్‌ టవర్ల నుంచి నాన్‌-అయానైజింగ్‌ రేడియో తరంగాలు చాలా తక్కువ శక్తితో వెలువడతాయని పేర్కొంది.
 
ఆ రేడియో తరంగాలతో ఎలాంటి కణాలపై లేదా మానవులపై ఏ విధమైన ప్రభావాన్నీ చూపలేవని డాట్‌ పేర్కొంది. నాన్‌-అయానైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిషన్‌ , డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసిన పరిమితుల కంటే 10 రెట్ల భద్రతా నిబంధనల్లో ఉన్నామని డాట్‌ తెలిపింది. పలు దేశాల్లో 5జీ సేవలను ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇలాంటి తప్పుడు సమాచారం చూపి భయభ్రాంతులకు గురికావొద్దని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడలేని అసమర్థ సీఎం జగన్: వంగలపూడి అనిత