Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టాకు టిక్ టాక్‌తో కొత్త తలనొప్పి.. వర్టికల్‌ వీడియో ఫీచర్‌ వచ్చేస్తోంది..

Advertiesment
ఇన్‌స్టాకు టిక్ టాక్‌తో కొత్త తలనొప్పి.. వర్టికల్‌ వీడియో ఫీచర్‌ వచ్చేస్తోంది..
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:57 IST)
టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన తర్వాత యూజర్స్ ప్రత్యామ్నాలపై దృష్టి సారించారు. దీంతో ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు షార్ట్‌ వీడియో ఫీచర్స్‌ని పరిచయం చేశాయి. వీటిలో ఇన్‌స్టాగ్రాం రీల్స్‌కు టిక్‌టాక్‌తో కొత్త తలనొప్పి మొదలైంది. 
 
టిక్‌టాక్ వీడియోలను యూజర్స్‌ ఇన్‌స్టాగ్రాం రీల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారట. టిక్‌టాక్‌, రీల్స్‌లో ఒకే రకమైన ఫీచర్స్ ఉండటం వల్ల టిక్‌టాక్‌లో రూపొందించిన వీడియోలను రీల్స్‌ సపోర్ట్ చేస్తుందట. దీంతో రీల్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలు టిక్‌టాక్‌ వాటర్‌మార్క్‌తో కనిపిస్తున్నాయి. 
 
ఇలా చేయడం వల్ల ఇన్‌స్టాగ్రాం రీల్స్‌లో ఒరిజినల్ కంటెంట్‌ కాకుండా కాపీ కంటెంట్ ఎక్కువగా పోస్ట్ అవుతోందట. దీంతో టిక్‌టాక్‌ వాటర్‌ మార్క్‌తో ఉన్న వీడియోలు సపోర్ట్ చేయకుండా ఇన్‌స్టాగ్రాం తన అల్గారిథమ్‌లో మార్పులు చేయనుంది.
 
''ఇన్‌స్టాగ్రాం ఎప్పుడూ ఒరిజినల్ కంటెంట్‌ని మాత్రమే ప్రోత్సహిస్తుంది. యూజర్స్ టిక్‌టాక్ వాటర్‌ మార్క్‌ ఉన్న వీడియోలను రీల్స్‌లో పోస్ట్ చేయవద్దు'' అని ఒక ప్రకటనలో కోరింది. ఇకమీదట ఎవరైనా కాపీ కంటెంట్ పోస్ట్ చేయాలని ప్రయత్నిస్తే రీల్స్ దాన్ని సపోర్ట్ చేయదని తెలిపింది. 
 
మరోవైపు వర్టికల్‌ వీడియో ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఇన్‌స్టా ఇది వరకే ప్రకటించింది. దీంతో యూజర్ వీడియోలను టిక్‌టాక్ తరహాలో పై నుంచి కిందకి జరుపుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20 నుంచి తిరుపతి గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు