Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా కుబేరుల జాబితాలో చెన్నై అరుణ్ పుదుర్‌దే అగ్రస్థానం!

Advertiesment
Indian tech billionaire Arun Pudur tops Asia’s wealthiest under-40 list
, మంగళవారం, 12 మే 2015 (11:16 IST)
భారత్‌లో బిలియనీర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. భారత్‌లో ప్రత్యేకించి యువతలో బిలియనీర్లుగా మారుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోందని ఫోర్బ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల లోపు వయస్సున్న ఆసియా కుబేరుల్లో చెన్నైకి చెందిన అరుణ్ పుదుర్ అగ్రగణ్యుడిగా పేరొందారు. 'సెల్ ఫ్రేమ్' పేరిట సాఫ్ట్ వేర్ సంస్థను నెలకొల్పి విభిన్న రంగాల్లో దూసుకెళుతున్న అరుణ్ సంపద ప్రస్తుతం 400 కోట్ల డాలర్లు చేరుకుందట. 
 
అరుణ్ కంపెనీ తయారు చేసే వర్డ్ ప్రాసెసర్లు, మైక్రోసాఫ్ట్ తయారు చేసే ప్రాసెసర్ల స్థాయిలో పేరొందాయి. 1998లో సెల్ ఫ్రేమ్‌ను స్థాపించిన అరుణ్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లోనూ రాణిస్తున్నారు. కాగా 37 ఏళ్ల అరుణ్  1998లో సెల్ ఫ్రేమ్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత  అరుణ్ ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ఫామ్‌.. ప్రముఖ వర్డ్ ప్రొసెసర్ మైక్రోసాఫ్ట్‌కు తర్వాతి స్థానంలో నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu