జియోకు ఎయిర్‌టెల్ చెక్ పెట్టేందుకు... ఏకం కానున్న ఐడియా-వొడాఫోన్
రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు దిగ్గజ టెలికాం సంస్థలు ఏకం కానున్నాయి. ఉచిత డేటా వంటి సెన్సేషల్ ఆఫర్లతో ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు, అలాగే భారతీ
రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు దిగ్గజ టెలికాం సంస్థలు ఏకం కానున్నాయి. ఉచిత డేటా వంటి సెన్సేషల్ ఆఫర్లతో ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు, అలాగే భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టేందుకు వొడాఫోన్, ఐడియాలు ఏకం కానున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో వొడాఫోన్‌కు చెందిన అన్ని షేర్లను కలిపేందుకు చర్చలు జరుగుతున్నాయి.
బ్రిటీష్ కంపెనీ అయిన వొడాఫోన్, ఆదిత్యా బిర్లా గ్రూపుకు చెందిన ఐడియా ప్రస్తుతం భారత్‌లో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. రెండు దిగ్గజాలు కలవడం ద్వారా భారత్ మార్కెట్లో నెం.1 స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ను, ఆఫర్లతో గుబులు పుట్టిస్తోన్న జియోను కూడా వెనక్కి నెట్టవచ్చునని ఐడియా యోచిస్తోంది. ఐడియా-వొడాఫోన్ కలవడం ద్వారా ఎయిర్‌టెల్-జియోకు దెబ్బేనని నిపుణులు అంటున్నారు.
ఐడియా-వొడాఫోన్ ఒక్కటైతే జియోకు నంబర్ వన్ అసాధ్యమేనంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 27 కోట్లమంది వినియోగదారులతో అగ్రస్థానంలో ఉంది. ఐడియా-వొడాఫోన్ ఒక్కటైతే వాటి మొత్తం వినియోగదారుల సంఖ్య 39 కోట్లకు చేరుకుంటుంది.