Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్.. ఇప్పుడు ఐబీఎం వంతు.. 5 వేల ఉద్యోగాల ఊస్టింగ్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను దిగ్గజ టెక్ కంపెనీలు తు.చ. తప్పుకుండా పాటిస్తున్నాయి. ట్రంప్ అమలు చేస్తున్న విధానాలను పాటించే చర్యల్లో భాగంగా, తమ కంపెనీల్లో ఉన్న భారతీయ టెక్కీలను తొలగించే

Advertiesment
డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్.. ఇప్పుడు ఐబీఎం వంతు.. 5 వేల ఉద్యోగాల ఊస్టింగ్!
, బుధవారం, 17 మే 2017 (10:26 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలను దిగ్గజ టెక్ కంపెనీలు తు.చ. తప్పుకుండా పాటిస్తున్నాయి. ట్రంప్ అమలు చేస్తున్న విధానాలను పాటించే చర్యల్లో భాగంగా, తమ కంపెనీల్లో ఉన్న భారతీయ టెక్కీలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ జాబితాలో ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌లు చేరగా, తాజాగా ఐబీఎం కూడా చేరాయి. 
 
ఐబీఎం యాజమాన్యం తీసుకున్న చర్యలపై ఉద్యోగులను కలవర పెడుతోంది. 'ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నైపుణ్యం లేని ఉద్యోగులను గుర్తించమని మేనజర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి' అని ఐబీఎం ఉద్యోగి ఒకరు తెలిపారు. తీసివేతల విషయంలో పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత కానీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ఎటువంటి చర్యలు చేపట్ట కూడదని ఐబీఎం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. 
 
అయితే సంస్థ నుంచి ఎంతమంది ఉద్యోగులను తొలగించేది.. ఎటువంటి ఉద్యోగులను తొలగించనున్నారు అన్న విషయంలో ఐబీఎం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌లో 1.50 లక్షల మంది ఐబీఎం ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందో తెలియక ఐబీఎం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాడు తండ్రి కాదు.. పాషాణ హృదయుడు... కుమార్తె చనిపోవడానికి 2 రోజుల ముందు లీగల్ నోటీస్