జియో గిగాఫైబర్‌‌నెట్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి..!

మంగళవారం, 20 ఆగస్టు 2019 (17:40 IST)
ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి భారత్‌లో తన జియో గిగాఫైబర్ సేవలను అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించి ఇటీవల జరిగిన 42వ ఏజీఎంలో ఛైర్మన్ ముకేష్ అంబానీ జియో గిగాఫైబర్ వివరాలను వెల్లడించారు. 
 
ఈ క్రమంలో గిగాఫైబర్ సేవలను వినియోగదారులకు అందించడానికి రూ.700 మొదలుకొని రూ.10వేల వరకు నెలవారీ ప్లాన్‌లు అందుబాటులో ఉంచనుంది. ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ వరకు లభిస్తుంది. గిగాఫైబర్ సేవలను పొందడానికి ఎవరైనా కూడా క్రింద తెలిపిన పద్ధతిలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలను మీరు కూడా ఓసారి పరిశీలించండి.
 
దశ 1: జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ https://gigafiber.jio.com/registrationకు వెళ్లండి.
 
దశ 2: యూజర్లు తమ చిరునామా వివరాలను నమోదు చేయాలి. 
 
దశ 3: పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్ వివరాలను పొందుపరచాలి.
 
దశ 4: మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నిర్ధారించాల్సి ఉంటుంది. 
 
దశ 5: రిలయన్స్ జియో ప్రతినిధి వినియోగదారులను సంప్రదించి వివరాలను సరిచూసుకున్న తర్వాత జియో గిగాఫైబర్ కనెక్షన్ ఇస్తారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇద్దరూ ఫ్రెండ్స్‌తో మాట్లాడాను.. మిస్టర్ ఖాన్ రెచ్చగొట్టొద్దు : డోనాల్డ్ ట్రంప్