Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Google Nano Banana AI: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నానో బనానా టూల్

Advertiesment
Google Nano Banana AI

సెల్వి

, గురువారం, 11 సెప్టెంబరు 2025 (18:25 IST)
Google Nano Banana AI
సోషల్ మీడియాలో ప్రస్తుతం నానో బనానా ట్రెండ్ కొనసాగుతోంది. గూగుల్ రూపొందించిన జెమినీ యాప్‌లో భాగమైన ఒక అప్డేటెడ్ టూల్. ఈ ఫొటో ఎడిటింగ్ టూల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యువతను ఈ ట్రెండ్ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ టూల్‌తో క్రియేట్ చేసిన ఫొటోలు చూస్తే.. బట్టలు, ఫేస్ ఎక్స్‌ప్రెషన్, బ్యాక్‌గ్రౌండ్ అన్నీ చాలా న్యాచురల్‌గా కనిపిస్తాయి. ఈ టూల్ అందరికీ ఫ్రీగా అందుబాటులో వుంటుంది. 
 
ఈ టూల్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ టూల్ ఎందుకంత పాపులర్ అయిందంటే.. దీన్ని వాడటం చాలా ఈజీ. మీకు గూగుల్ అకౌంట్ ఉంటే చాలు.. ఇంకేలాంటి టెక్నాటజీ అవసరం లేదు. ఈ టూల్‌తో ఫొటోలను అద్భుతమైన 3D చిత్రాలుగా మార్చవచ్చు. సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌లో చేరడంతో దీని క్రేజ్ మరింత పెరిగింది. ఇక చాలా మంది హీరోలు, హీరోయిన్ల పెట్స్ ఫొటోలను 3D బొమ్మలుగా మార్చి సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమారుడిని చంపేసి భార్యపై భర్త హత్యాయత్నం