Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ నుంచి గూగుల్ లెన్స్: టెక్నాలజీ మరో విప్లవం.. ఫోటో తీసి సెర్చ్ చేస్తే చాలు..!?

గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్లు మార్కెట్లోకి రానున్నాయి. టెక్ దిగ్గజంగా పేరున్న గూగుల్.. ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ వంటి కీలకమైన వాటిని ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్

గూగుల్ నుంచి గూగుల్ లెన్స్: టెక్నాలజీ మరో విప్లవం.. ఫోటో తీసి సెర్చ్ చేస్తే చాలు..!?
, శుక్రవారం, 19 మే 2017 (15:26 IST)
గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్లు మార్కెట్లోకి రానున్నాయి. టెక్ దిగ్గజంగా పేరున్న గూగుల్.. ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ వంటి కీలకమైన వాటిని ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కాలిఫోర్నియాలో జరిగిన గూగుల్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. వీటిలో గూగుల్ ఫ్యాన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన పిచాయ్.. గూగుల్ లెన్స్‌ గురించి చెప్పుకొచ్చారు. 
 
గూగుల్‌లో ఇప్పటిదాకా సమాచారం కోసం వెతికేటప్పుడు గూగుల్ టెక్ట్స్ ఎంటర్ చేసి వెతికేవాళ్లం. ప్రస్తుతం గూగుల్ లెన్స్ ద్వారా మన స్మార్ట్ ఫోన్లో దేన్నైనా ఫోటో తీసి సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మనకు సమాచారం కావాల్సిన వస్తువును లేదా సమాచారాన్ని ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే సరిపోతుంది. 
 
దాని గురించి వివరాలు తెలియవస్తాయి. ఇందుకోసం స్మార్ట్ ఫోన్లో 'గూగుల్ లెన్స్' యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అదే పువ్వును గూగుల్ లెన్స్‌లో ఫోటో తీస్తే చాలు ఇందుకు సంబంధించిన సమాచారం మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఇతర భాషలకు చెందిన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతం, ఆ ప్రాంతానికి చెందిన వంటకాల గురించి తెలుసుకోవాలంటే.. వాటిని ఫోటో తీసి సర్చ్ చేస్తే ఫుల్ డీటైల్స్ వచ్చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాహనాలు తగలబడిపోతున్నాయ్ : 47 డిగ్రీల ఉష్ణోగ్రత... వాతావరణ శాఖ హెచ్చరిక