జియోకు ఎయిర్‌టెల్ 5 GBతో షాక్... అర్థరాత్రి 12 గంటల నుంచి 6 గంటల వరకూ ఆడుకోండి...
టెలిఫోన్ సేవల ప్రొవైడర్ల మధ్య పోటీ తారాస్థాయికి వెళుతోంది. జియోతో ముఖేష్ అంబానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు మైండ్ బ్లాక్ చేయడంతో ఇప్పుడా సర్వీస్ ప్రొవైడర్లు కసి తీర్చుకునేందుకు సిద
టెలిఫోన్ సేవల ప్రొవైడర్ల మధ్య పోటీ తారాస్థాయికి వెళుతోంది. జియోతో ముఖేష్ అంబానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు మైండ్ బ్లాక్ చేయడంతో ఇప్పుడా సర్వీస్ ప్రొవైడర్లు కసి తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎయిర్ టెల్ భారీ ఆఫర్ ప్రకటించి జియోకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా ప్రీపెయిడ్ వినియోదాగదారుల కోసం ఎయిర్టెల్ 5 జీబీ ఇంటర్నెట్ డాటా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించి తన వినియోగదారులు జారిపోకుండా ఉండేందుకు తంటాలు పడుతోంది. ఈ సేవను ఉపయోగించుకునేందుకు airtel.in/free?icid=home_jackpot_row_4_column_1 లింకును తమతమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇలా చేసిన తర్వాత ‘జాక్ పాట్’ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే లింక్ అయిపోతారు. ఐతే ఈ ఉచిత డేటా ఆఫర్ అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరి అర్థరాత్రి వేళ వినియోగదారులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని వినియోగించుకోవాలేమో...?