Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతంగా పెరుగుతున్న ఆదరణ: శాంసంగ్ మొబైల్ బిజినెస్ హెడ్ రోహ్

Foldable Smartphones

ఐవీఆర్

, శనివారం, 20 జులై 2024 (20:05 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో ఒకటి భారతదేశం. శాంసంగ్‌కు అతి ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా కొనసాగుతోందని దక్షిణ కొరియాలో అగ్రగామి సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. భారతదేశంలో విక్రయించబడే దాదాపు 80% స్మార్ట్‌ఫోన్‌లు రూ.30,000 కంటే తక్కువ ధరను కలిగి ఉన్నాయి. ఐతే ఎక్కువమంది వినియోగదారులు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఫోల్డబుల్స్ వంటి ఉత్పత్తుల వృద్ధిని పెంచుతున్నారు.
 
“ఫోల్డబుల్స్ విపరీతంగా పెరుగుతున్న మార్కెట్లలో భారతీయ మార్కెట్ ఒకటి. ఈ వృద్ధిలో అత్యంత కీలకంగా గెలాక్సీ ఫోల్డబుల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మార్కెట్ డిమాండ్ పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఫోల్డబుల్స్ కోసం మెరుగైన రీతిలో గెలాక్సీ ఏఐను అందించటంతో భారతీయ కస్టమర్లు కొత్త గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, కొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6ని స్వీకరించడంపై మాకు అధిక అంచనాలు ఉన్నాయి” అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ ప్రెసిడెంట్, హెడ్ టి ఎం రోహ్ అన్నారు.
 
శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో అపూర్వ ఆదరణ పొందాయి, కేవలం 24 గంటల్లో మునుపటి తరం ఫోల్డబుల్‌ ఫోన్లతో పోలిస్తే 40% అధిక ప్రీ-ఆర్డర్‌లను నమోదు చేశాయి. ఆరవ తరం గెలాక్సీ ఫోల్డబుల్స్‌లో గెలాక్సీ ఏఐ శక్తి వుంది, ఇది శాంసంగ్ యొక్క ఏఐ టూల్స్ దీనిలో ఉండటం వల్ల, ఇది కమ్యూనికేషన్‌ల అడ్డంకులను ఛేదించడంలో, వినియోగదారుల సృజనాత్మకత, ఉత్పాదకతను వెలికితీయడంలో సహాయపడుతుంది.
 
మొబైల్ ఏఐ ని పెద్ద ఎత్తున శాంసంగ్ ప్రజాస్వామీకరిస్తుందని, ఏడాది చివరి నాటికి 200 మిలియన్ల గెలాక్సీ పరికరాల్లో గెలాక్సీ ఏఐని చేర్చాలని యోచిస్తున్నామని టిఎం రోహ్ వెల్లడించారు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, కొత్త గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 అత్యంత శక్తివంతమైన గెలాక్సీ ఏఐ మెరుగుపరచబడిన ఫోల్డబుల్ డిజైన్‌లు, ఆప్టిమైజ్ చేయబడిన గెలాక్సీ ఏఐ అని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో నిఫా వైరస్.. ఉత్తర మలప్పురం జిల్లాలో బాలుడికి పాజిటివ్?