సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్‌లు పెరిగిపోతున్నాయి. తాజాగా మహిళల సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్ ఫోటోలను డౌన్ లోడ్ చేసి.. వాటిని మార్ఫ్ చేసి.. ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన సుమిత్ ఝా(26) అనే వ్యక్తి మహిళల సోషల్ మీడియా అకౌంట్ నుంచి వారి ప్రొఫైల్ పిక్చర్స్ డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫ్ చేసేవాడు. తర్వాత సేమ్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఆ ఫోటోలను సదరు మహిళలకి పంపి.. అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేదంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ఇలా దాదాపు 100 మహిళలను బ్లాక్‌మెయిల్ చేశాడు.
తన పప్పులు అందరూ దగ్గరు ఉడుకుతాయనుకున్న సుమిత్.. బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళను కూడా బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో మిగతా బాధితుల గురించి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు.