జియో దెబ్బ.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. రూ.249కే అపరిమిత ఇంటర్నెట్
రిలయన్స్ జియో సేవలు సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ధరల విషయంలో కిందికి దిగిరాక తప్పడం లేదు. ముఖ్యంగా, ప్రైవేట్ సంస్థల పరిస
రిలయన్స్ జియో సేవలు సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ధరల విషయంలో కిందికి దిగిరాక తప్పడం లేదు. ముఖ్యంగా, ప్రైవేట్ సంస్థల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అందుకే ఉన్న వినియోగదారులు చేజారిపోకుండా, కొత్త వినియోగదారులను ఆకర్షించేలా సరికొత్త బ్రాండ్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఇందులోభాగంగా రూ.249 (బీబీ249 ప్లాన్)తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. తాజా పథకంలో రూ.249తో రీఛార్జ్ చేసుకుంటే 1జీబీ వరకు 2ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 1ఎంబీపీఎస్ వేగంతో నెల మొత్తం అపరిమితంగా అంతర్జాలాన్ని వాడుకోవచ్చని, ఇది కేవలం కొత్త వినియోగదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులని, ఈనెల తొమ్మిది తేదీ నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అలాగే, ఈ స్కీమ్ ప్రమోషనల్ సమయంలో ఇన్‌స్టాలేషన్ చార్జీలను పూర్తిగా మినహాయించనున్నారు.