జియో దెబ్బకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... రూ.99తో అపరిమిత కాల్స్...
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు పలు టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి కంపెనీలు ఇప్పటికే అపరిమిత వాయిస్ కాల్స్‌ను తమ వి
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు పలు టెలికాం కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి కంపెనీలు ఇప్పటికే అపరిమిత వాయిస్ కాల్స్‌ను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి.
ఇపుడు ఈ కంపెనీల బాటలోనే ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. దీనికోసం కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని తెలిపింది.
రూ.99తో రీచార్జ్ చేపించుకుంటే నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్ , బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రేట్ ఆఫర్ కోల్‌కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లు నెట్‌వర్క్ పరిధిలోని కాల్స్‌కు వర్తిస్తుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149లకు రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అలాగే, కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకునేలా అవకాశంతో పాటు 1జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది 30 రోజుల పాటు వాలిడిటీ కలిగివుంటుంది. కాగా, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అపరిమిత 3జీ సర్వీసులను రూ.1099కు అందిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.