ఎక్కడి పడితే అక్కడ సెల్ చార్జింగ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త...
విజయవాడ: ఇపుడు ఎవరికైనా, ఎక్కడైనా ఒకటే సమస్య... సెల్ ఛార్జింగ్ అయిపోయింది. కాస్త చార్జింగ్ పెట్టుకోనిస్తారా? అంటూ ప్రాధేయపడుతుంటారు. కానీ, బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు బస్టాండ్లు రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే ఛార్జర్ల
విజయవాడ: ఇపుడు ఎవరికైనా, ఎక్కడైనా ఒకటే సమస్య... సెల్ ఛార్జింగ్ అయిపోయింది. కాస్త చార్జింగ్ పెట్టుకోనిస్తారా? అంటూ ప్రాధేయపడుతుంటారు. కానీ, బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు బస్టాండ్లు రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే ఛార్జర్లతో మీ మొబైల్‌ను ఛార్జ్ చేసుకునే అలవాటు ఉంటే వెంటనే దానికి స్వస్తి చెప్పండి...ఇక ముందు అలా చేయకండి. ఎందుకంటే, చార్జింగ్ పెట్టిన ఫోన్లలో నుంచి సమాచారాన్ని తస్కరించే మొబైల్ చార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న విషయం కూడా మీకు తెలియదంటే నమ్మండి. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో తెలుసుకుంటే షాక్ అవుతాం.
మాములు చార్జర్ల మాదిరి కాకుండా ఇలాంటి చార్జర్లలో ఒక ప్రత్యేకమైన సర్క్యూట్‌ను అమర్చుతారు. ఒకసారి ఫోన్‌ను ఈ చార్జర్‌తో చార్జింగ్ పెట్టిన తర్వాత సర్క్యూట్ యాక్టివేటై ఫోన్‌ను యూఎస్బీ ఓటీజీ మోడ్‌లోకి తీసుకువెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్ యాక్టివేట్ అవగానే సమాచారాన్ని తస్కరించాలనుకునే వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా లేదా రేడియో ఫ్రీక్వెన్నీ సిగ్నల్స్ ద్వారా ఫోన్‌లోని డేటాను కాపీ చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నా జరుగుతుందంటే ఎంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ వ్యవస్థను రూపొందించారో ఆలోచించండి. కాబట్టి బయటి ప్రదేశాలలో సెల్ ఫోన్ చార్జింగ్ చేసేటపుడు తస్మాత్ జాగ్రత్త.