లోన్ తీసుకుంటున్నారా? సిబిల్ స్కోరే కాదు.. సోషల్ మీడియా స్కోర్ కూడా ముఖ్యమట..!
ఇంటర్నెట్‌లో గంటలు గంటలు గడుపుతున్నారా? నెట్ ఉంది కదాని గంటల పాటు కుర్చీలకే అతుక్కుపోతున్నారా? అయితే మీ మొత్తం వివరాలను కాజేసే పని సైలెంట్‌గా జరిగిపోతుందని తెలుసుకోండి. ఎలాగంటే.. గూగుల్, ట్విట్టర్, ఫే
ఇంటర్నెట్‌లో గంటలు గంటలు గడుపుతున్నారా? నెట్ ఉంది కదాని గంటల పాటు కుర్చీలకే అతుక్కుపోతున్నారా? అయితే మీ మొత్తం వివరాలను కాజేసే పని సైలెంట్‌గా జరిగిపోతుందని తెలుసుకోండి. ఎలాగంటే.. గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్రమాదం ఉన్నా.. లోన్ తీసుకోవాలంటే ముందుగా సోషల్ మీడియాలో మీ ప్రవర్తన ఎలా ఉందనే దానిపై స్కోరు బ్యాంకులకు అందుతుందని తెలిసింది. ఆన్ లైన్ బ్యాంక్ ద్వారా లోన్లకు అప్లై చేసేందుకు.. తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులను గురించి గంటల సేపు సెర్చ్ చేస్తే.. కొన్ని కళ్లు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాయనేది గమనించాలి.
ఇన్‌స్టా పైసా, క్యాష్ కేర్, వోట్ క్యాష్ వంటి ఆన్ లైన్ పెట్టుబడి సంస్థలతో పాటు బ్యాంక్‌బజార్.కామ్ వంటి ఆన్‌లైన్ మార్కెట్లు నెట్ జనంపై కన్నేసి ఉంచుతాయట. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ళలోపు వయసువాళ్ల ట్రాక్ రికార్డ్ చెక్ చేసే పనిలోపడ్డాయట. ఈ ఏజ్ గ్రూప్ గతంలో లోన్లు తీసుకున్నారా? తీసుకున్నవి తిరిగి చెల్లించారా? లోన్ చెల్లించాలన్న ఎస్.ఎం.ఎస్‌లకు వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంది. ఫోన్‌కాల్‌కు సమాధానమిచ్చే తీరెలా ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందన్న విషయాలపై సమాచారం సేకరించి వాళ్ళకు కొంత స్కోర్ వేస్తారు.
అంతేకాకుంగా లోన్ కోసం అప్లై చేసిన సదరు వ్యక్తి గూగుల్‌లో తమ బ్యాంక్ వ్యవహారాల గురించి ఎన్నిసార్లు వెబ్‌సైట్‌ను విజిట్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడా, జూదగాడా ఎట్సెట్రా సమాచారం సేకరించి వచ్చిన స్కోరు మెరుగ్గా ఉంటే అప్పుడు బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ఆలోచిస్తాయట. అదీ సంగతి సో... సోషల్ మీడియాలో మీ బిహేవియరే మీకు శ్రీరామ రక్ష అని గమనించాలి. సో సిబిల్ స్కోరుతో పాటు సోషల్ మీడియా ఇచ్చే స్కోరు కూడా లోన్ పొందేందుకు ముఖ్యమన్నమాట..