ఆపిల్ నుంచి కొత్త వస్తువు మార్కెట్లోకి విడుదలైంది. శక్తివంతమైన M3 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఆపిల్ ఆవిష్కరించింది. ఇవి 13-అంగుళాల, 15-అంగుళాలలో లభిస్తాయి. తేలికపాటి డిజైన్, 18 గంటల బ్యాటరీ జీవితం, లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, కొత్త సామర్థ్యాలను కలిగి ఉంటాయి.
M3తో, మ్యాక్‌బుక్ ఎయిర్ M1 చిప్ ఉన్న మోడల్ కంటే 60 శాతం వరకు వేగవంతమైంది. అలాగే వేగవంతమైన ఇంటెల్ ఆధారిత మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే 13 రెట్లు వేగవంతమైనదని ఆపిల్ తెలిపింది.
కొత్త సామర్థ్యాలలో గరిష్టంగా రెండు అవుట్ డిస్‌ప్లేలకు మద్దతు, రెండు రెట్లు వేగవంతమైన వైఫైలు వున్నాయి. ఇది ప్రపంచంలోనే ఉత్తమమైన సన్నని, తేలికపాటి ల్యాప్‌టాప్.. అని ఆపిల్ వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్ అన్నారు.
కస్టమర్‌లు ఇప్పుడు కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ని M3తో ఆర్డర్ చేయవచ్చు. ఇది మార్చి 8న వస్తుంది. M3తో కూడిన 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ రూ. 114,900 నుంచి అందుబాటులోకి రానుంది. రెండూ మిడ్‌నైట్, స్టార్‌లైట్, సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో అందుబాటులో ఉన్నాయి.