Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో ఈ నెల 20 నుంచి ఐఫోన్-16 సిరీస్ విక్రయాలు

iPhonbe 16 series

ఠాగూర్

, బుధవారం, 11 సెప్టెంబరు 2024 (10:11 IST)
యాపిల్ సంస్థ సోమవారం తమ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ విక్రయాలు మాత్రం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్, బిగ్ సైజ్ డిస్‌ప్లేలు, వినూత్నమైన ప్రో కెమెరా ఫీచర్లు, అధిక బ్యాటరీ లైఫ్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో ఈ కొత్త ఫోనును తీసుకొచ్చింది. దీంతో ఎంతో కాలంగా ఐఫోన్ 16 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియుల నిరీక్షణకు తెరపడింది.
 
ఏ18 ప్రో చిప్‌తో పనిచేసే ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ల కొత్త 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో పాటు వేగవంతమైన క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఈ ఫోన్లతో డాల్బీ విజన్‌లో 4కే 120 ఎఫ్పీఎస్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ బ్లాక్ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం, డెజర్ట్ టైటానియం రంగులలో అందుబాటులో ఉంటాయి. అలాగే 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 119,900. ఇక ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.144,900. 
 
కాగా, భారత్‌లోని వినియోగదారులు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ను ఈ నెల 13 (శుక్రవారం) నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీలలో అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900గా నిర్ణయించిన కంపెనీ, ముందస్తు బుకింగ్లు సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుచానూరులో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం