గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో సుందర్ పిచాయ్ మాత్రం 226 మిలియన్ డాలర్ల పారితోషికం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
గత ఏడాది సుందర్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే 800 రెట్లు అధికం కావడం సంచలనం కలిగిస్తోంది.
సంస్థలో పొదుపు చర్యల పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో సుందర్ ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మొత్తం12 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు గూగుల్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.