Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో ఉచిత ఆఫర్‌తో ఎయిర్‌టెల్ బెంబేలు... జీవితాంతం ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు... ట్రాయ్‌కు విజ్ఞప్తి

మాట్లాడు ఇండియా మాట్లాడు అనే నినాదం ఇప్పుడు వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ తో దేశంలో ప్రతి మూలనున్నవారు సైతం జియో సిమ్ కోసం పరుగులు తీస్తున్నారు. ఆ తర్వాత ఎంత ఆనందం... ఇష్టమొచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు... ఇష్టమొచ్చినంతసేప

జియో ఉచిత ఆఫర్‌తో ఎయిర్‌టెల్ బెంబేలు... జీవితాంతం ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు... ట్రాయ్‌కు విజ్ఞప్తి
, బుధవారం, 26 అక్టోబరు 2016 (18:28 IST)
మాట్లాడు ఇండియా మాట్లాడు అనే నినాదం ఇప్పుడు వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ తో దేశంలో ప్రతి మూలనున్నవారు సైతం జియో సిమ్ కోసం పరుగులు తీస్తున్నారు. ఆ తర్వాత ఎంత ఆనందం... ఇష్టమొచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు... ఇష్టమొచ్చినంతసేపు సమాచారాన్ని చూడవచ్చు. చాలా హ్యాపీగా ఉందంటున్నారు జియో కస్టమర్స్. 
 
ఐతే జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా కుదేలవుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా జియో ఇచ్చిన ఆఫర్ల పైన మండిపడుతున్నాయి. తాజాగా భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ బుధవారం నాడు మాట్లాడుతూ... జీవితాంతం దేన్నీ ఉచితంగా ఇవ్వకూడదంటూ జియో ఉచిత వాయిస్ కాల్స్ గురించి ప్రస్తావించారు. జియో ఉచిత ఆఫర్లపైన ట్రాయ్ మరొక్కసారి పరిశీలించాలంటూ విజ్ఞప్తి చేశారు. కాగా గతంలో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు ట్రాయ్ కు చేసిన ఫిర్యాదులను తోసిపుచ్చడమే కాకుండా ఆ కంపెనీలకు రూ. 3050 కోట్లు జరిమానా విధించింది. 
 
చూడండి జియో టారిఫ్ ప్లాన్... ఏ ప్లానైనా ఉచితంగా వాయిస్ కాల్స్...
 
దీనితో రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టెలికాం సంస్థలు మూలుగుతున్నాయి. జియో దెబ్బకు కోట్లలో నష్టాలను చవిచూస్తున్నాయి. అసలే నష్టాలతో మూలుగుతున్న ఈ కంపెనీలపై ట్రాయ్ కొరడా ఝుళిపించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మొబైల్‌ లైసెన్స్‌ నిబంధనలను సంస్థలు ఉల్లంఘించడాన్ని ట్రాయ్‌(టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) తప్పుబడుతూ ఏకంగా రూ. 3050 కోట్లు జరిమానా విధించింది. 
 
ఈ మేరకు తన సిఫారసులను టెలికాం శాఖకు సిఫారసు చేసింది. ఆ సిఫారసుల ప్రకారం అత్యధికంగా వొడాఫోన్ పైన రూ. 1050 కోట్లు, ఐడియా పైన రూ. 950 కోట్లు, ఎయిర్ టైల్ పైన రూ.50 కోట్ల చొప్పున జరిమానా విధించింది. జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో ఈ కంపెనీలు మొండికేస్తున్నాయనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతను కాలేయం దానమిస్తే.. ఆమె హృదయం ఇచ్చి సొంతం చేసుకుంది!