డేటా ప్లాన్ల జాప్యం.. మొబైల్ ఆపరేటర్లపై ట్రాయ్ ఫైర్.. కాల్ నాణ్యత కోసం మైకాల్ యాప్ ఆవిష్కరణ
దీర్ఘకాలిక గడువులతో కూడిన డేటా ప్యాకులకు అనుమతులు ఇచ్చినప్పటికీ చాలా టెలికాం కంపెనీలు ఇంకా ఆ ప్లాన్లను ప్రవేశపెట్టకపోవడంపై ట్రాయ్ సీరియస్ అయ్యింది. ఏడాది గడువుతో కనీసం ఒక డేటా ప్యాక్‌నైనా ప్రకటించాలని
దీర్ఘకాలిక గడువులతో కూడిన డేటా ప్యాకులకు అనుమతులు ఇచ్చినప్పటికీ చాలా టెలికాం కంపెనీలు ఇంకా ఆ ప్లాన్లను ప్రవేశపెట్టకపోవడంపై ట్రాయ్ సీరియస్ అయ్యింది. ఏడాది గడువుతో కనీసం ఒక డేటా ప్యాక్‌నైనా ప్రకటించాలని మొబైల్ ఆపరేటర్లను ట్రాయ్ గట్టిగా కోరింది. ప్రాథమికంగా 90 రోజుల గరిష్ఠ గడువును 365 రోజులకు పెంచుకునేందుకు అనుమతులిచ్చి దాదాపు పది నెలలు గడుస్తున్నా... తమ సలహాలను ఏమాత్రం పాటించలేదని ట్రాయ్ టెలికాం సంస్థలపై ఫైర్ అయ్యింది.
కొద్దిమంది ఆపరేటర్లు మాత్రమే 365 రోజుల వరకు గడువుతో కూడిన డేటా స్పెషల్ టారిఫ్ ఓచర్ (ఎస్టీవీ)లను ప్రవేశపెట్టారని ట్రాయ్ వెల్లడించింది. ఇంకా కాల్ నాణ్యత కోసం మైకాల్ యాప్‌ను ట్రాయ్ ఆవిష్కరించింది. వినియోగదారుల స్పందన ఆధారంగా నెట్‌వర్క్ సమాచారాన్ని సమీకరించేందుకు ఈ యాప్ ఉపయోగపడగలదని ట్రాయ్ పేర్కొంది.