Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 ఏళ్ల బాలిక చెవిలో తిష్ట వేసి జీవిస్తున్న నల్ల గండుచీమలు... డాక్టర్లు షాక్...

Advertiesment
12 ఏళ్ల బాలిక చెవిలో తిష్ట వేసి జీవిస్తున్న నల్ల గండుచీమలు... డాక్టర్లు షాక్...
, గురువారం, 28 జనవరి 2016 (17:36 IST)
మనం ఎర్ర చీమలు, నల్ల చీమలను చూస్తుంటాం. ఐతే నల్ల గండుచీమలను కూడా చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. ఎర్ర చీమలు కుట్టాయంటే కరెంట్ షాకే. ఇక చిన్న నల్లచీమలు శరీరంపైన పాకుతుంటే వళ్లంతా జలదరిస్తుంది. అదే గండునల్ల చీమలు కుట్టాయంటే శరీరంపైన గాయం అవుతుంది. సహజంగా అవి కుట్టవు. ఐతే అలాంటి చీమలు 12 ఏళ్ల బాలిక చెవిలో చేరి తిష్ట వేసి జీవిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకుని వైద్యులు కూడా షాక్ తిన్నారు. 
 
వివరాల్లోకి వెళితే... అహ్మదాబాదులోని బన్సంక్తా పట్టణంలో 12 ఏళ్ల శ్రేయ డార్జి అనే బాలిక చెవిలో ఏదో గురగురమనడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో ఆమె తండ్రి చెవి దగ్గర చూస్తుండేసరికి సర్రుమంటూ ఓ నల్లటి గండుచీమ లోపల నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత మరొకటి... ఇలా నాలుగైదు రావడం మొదలుపెట్టాయి. దాంతో అతడు ఆమెను చెవి,ముక్కు, గొంతు చికిత్స చేసే వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా పరీక్షగా చూసిన వైద్యుడు ఆమె చెవిలో సుమారు 10 నల్లగండు చీమలున్నట్లు కనుగొని వాటిని బయటకు తీశాడు. ఐతే ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు అదే సమస్య. 
 
చెవిలో గురగుర. మళ్లీ వైద్యుడి వద్దకెళితే చీమలు చెవిలో తిష్టవేసి జీవిస్తున్నాయి. దాంతో వైద్యుడు షాక్ తిని లోపల చెవిలో కర్ణభేరిని ఏమయినా డ్యామేజ్ చేస్తున్నాయేమోనని పరీక్ష చేసి చూస్తే అదేమీ లేదని తేలింది. రాణి చీమ ఏదయినా గుడ్లు పెడుతుందేమోనని పరీక్షగా చూసినా అదేమీ లేదు. కానీ చీమలు మాత్రం ఆమె చెవిలో తిష్ట వేసి జీవిస్తున్నాయి. 
 
అసలెందుకు ఇలా జరుగుతుందో వైద్యులకు కూడా అంతుచిక్కలేదు. దీంతో ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచి ఆ చీమలు ఎలా వస్తున్నాయో పరీక్ష చేయడం మొదలుపెట్టారు. కాగా ఇలా నల్లగండు చీమలు తమ కుటుంబ సభ్యులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదనీ, తమ కుమార్తె చెవిలోనే ఎందుకు తిష్ట వేస్తున్నాయో తమకు అర్థం కావడంలేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu