Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంజాన్ పర్వదినాన 'ఫిత్రా'దానం చేయండి..!

Advertiesment
మహమ్మదీయులు
FILE
'హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అన్నారు ముహమ్మద్ ప్రవక్త చెప్పియున్నారు. ఫిత్రా అనే పదానికి అర్థం.. తనతోపాటు ఇతరులకు సంతోషాన్నివ్వడం. దానం చేయాలనే ధర్మం ప్రతి మనిషిలో వుంటుంది. ఈ ధర్మం ప్రకారం పేదలకు ధనరూపంలోగానీ వేరేదైనా దానం చేయాలి.

ప్రముఖంగా, ఈ ఫిత్రాను రంజాన్ పండుగనాడు మహమ్మదీయులు అవలంబిస్తారు. పేదలకు, అభాగ్యులకు తమకు వీలైనంత దానం చేస్తారు. ఇంకా ఇది ప్రతి ముస్లిం ఇవ్వాల్సిన కనీస దానమని మతపెద్దలు అంటున్నారు.

ఈ దానం, రంజాన్ పండుగకు మూడు రోజుల మునుపునుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ పండుగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా.. పేదలకు దానం చేసే ఈ విధానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. ఇంకా ఈ దానంతో కొన్ని పొరపాట్లు క్షమించబడుతాయని మతపెద్దలు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu