Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంజాన్ పండుగ సందర్భంగా ఫిత్రాలతో పేదలకు కాంతులు

Advertiesment
రంజాన్
, మంగళవారం, 30 ఆగస్టు 2011 (16:08 IST)
PTI
రంజాన్ మాసంలోని చివరి దినాల్లో ఫిత్రాలు చెల్లించాలి. ఉపవాసం పాటిస్తున్న క్రమంలో మానవ సహజ బలహీనతల వల్ల ఏమైన చిన్నచిన్న తప్పులు దొర్లితే ఫిత్రా దానం వల్ల అవి మన్నించబడి రోజా పరిశుద్ధమవుతుంది.

ఫిత్రాల వల్ల పేదసాదల పండుగ అవసరాలు తీరతాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ సామగ్రి కొనుక్కోలేని వారికి ఇది కాస్తంత ఆసరా అవుతుంది. అందుకని పండుగ కంటే ముందే ఫిత్రాలు ఇచ్చేస్తే వారు కూడా పండుగకు అవసరమైనవి కొనుక్కుని అందరితోపాటు సంతోషంగా నమాజులలో పాల్గొనగలుగుతారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నది ఫిత్రాల్లోని పరమార్థం. ఫిత్రా చెలిస్తే నీకు ఫికిర్ ఉండదోయి ఉపవాసం శుద్ధమై దైవాన్ని చేరునోయి. పేదసాద జనులకు ఫిత్రా ఒక ఆసరా అండగ మేమున్నామని మనమిచ్చే థిలాసా.

Share this Story:

Follow Webdunia telugu