ప్రేమించు-ప్రేమింపజేసుకో-ఇదే జీవిత ముఖ్య లక్ష్యం - మహమ్మదు ప్రవక్త
మహమ్మదు ప్రవక్త సూక్తులు కొన్ని మీ కోసం...* సత్యవాదికి ధర్మ దూషణ పనికిరాదు. * ధర్మ మార్గంలో చింతించు, ఇదే మంచి మానవుని లక్షణం. ధర్మ మార్గంలో నడుచుకో, అదే దివ్య లక్షణం. * ఆపేక్షించే గర్భదరిద్రులకు గుప్తంగా సహకరించి ఆదుకో. బహిరంగంగా నీతులు బోధించడం నేర్చుకో. * పరస్పానురాగాలతో ప్రవృద్ధి పొందే వారిని స్వర్గం ఆహ్వానిస్తుంది. పరస్పర ద్వేషులకు నరకమే ప్రాప్తి. * వివేకాన్ని మించిన అమూల్య వస్తువు లేదు. * ఆమరణాంతం ఉత్తమ జ్ఞానాన్ని వృద్ధి పెంపొందించుకో. * సంతాన హీనులకు చింత ఎందుకు? సమ్రక్షించి పెంచగలిగితే అనాధుని దత్తు చేసుకో. * కన్న తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉత్తమ గురువులు. చాకచక్యంతో, నేర్పుతో, అనురాగంతో ఉపదేశించు. * విద్యాభూషణమే ఉత్తమ భూషణము. విద్యాశయం వ్యాపారం కాకూడదు. మంచిని పెంచేదే విద్య. నవనాగరీకంగా ఉండాలి. నిష్ఫలమైనదిగా ఉండకూడదు. * సంపద కలిగినపుడు భగవంతుని అభినందించు. కష్టాలు కలిగితే శరణు వేడుకో. ఎవరి ముక్తి మార్గం వారే చూసుకోవాలి.