ఆసియాలోనే అత్యంత భారీ మసీదు ప్రారంభం!
ఆసియాలోనే అత్యంత పెద్దదైన మసీదు కజఖస్థాన్ రాజధాని అస్తానాలో ప్రారంభమైంది. ఈ మసీదు ప్రార్థనా మందిరాన్ని 17,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించారు. మధ్యలో ఉన్న గుమ్మటం ఎత్తు 51 మీటర్లు కావడం గమనార్హం.కజఖస్థాన్‌లోని ఈ అత్యంత భారీ మసీదును శుక్రవారం ప్రారంభించారు. ఈ మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశాధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్ బయేవ్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి 12 గంటల్లో ఖురాన్‌ను అప్పజెప్పి రికార్డు సృష్టించాడు. మొత్తం ఖురాన్‌ను కంఠస్థం చేయడానికి ఎనిమిది నెలల సమయం పట్టిందని ఆ విద్యార్థి తెలిపాడు.