Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రంజాన్‌ చివరి వారం... పవిత్రం... ఆత్మీయ సమ్మేళనానికి, పసందైన విందుకీ సమయం!

Mutton Biryani
, బుధవారం, 19 ఏప్రియల్ 2023 (15:55 IST)
ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్‌ మాసం చివరి వారం వచ్చేసింది. ప్రార్థన, సమాజం కోసం సమయం కేటాయించడానికీ ఇది సమయం. అంతేకాదు, ఉపవాసాలు ఆ ఉపవాస ముగింపు వేళ బంధువులు, స్నేహితులతో విందును ఆస్వాదించడం... వినూత్నమైన సీజన్‌గా ఇది నిలుస్తుంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత వైవిధ్యమైన ముస్లిం సమాజం ఉంటుంది. ఇది మహోన్నతమైన కలినరీ సంప్రదాయాలను ఈ సమయంలో చూపుతుంటుంది.
 
దక్షిణ  భారతదేశంలో రంజాన్‌ చివరి మాసంలో ఇఫ్తార్‌ విందు సంప్రదాయం అధికంగా కనబడుతుంది. సూర్యాస్తమయం ప్రార్థనలు ముగిసిన తరువాత ముస్లింలు ఈ విందు చేసుకుంటుంటారు. ఈ భోజనాలు సాధారణంగా ఖర్జూరం ఆరగించడంతో ప్రారంభమై నీరు లేదా జ్యూస్‌ తీసుకోవడం చేస్తారు. ఆ తరువాత విస్తృత శ్రేణి రుచులు, స్వీట్లు తింటారు. సాధారణంగా అవి ఆ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందినవే అయి ఉంటాయి.
 
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అలాంటి డిషెస్‌లో సమోసా ఒకటి. కూరగాయలు లేదా మాంసం వంటి వాటితో నింపబడిన ఈ త్రికోణాకారపు పేస్ట్రీని పుదీనా చట్నీ లేదా చింతపండు సాస్‌తో కలిపి సర్వ్‌ చేస్తుంటారు. ఇక ఇఫ్తార్‌ విందులో కనిపించే మరో అంశం బిర్యానీ. సాధారణంగా మటన్‌ లేదా చికెన్‌,  వెజిటేబుల్స్‌తో తయారుచేసే ఈ బిర్యానీని రైతాతో కలిపి సర్వ్‌ చేస్తారు. తియ్యందనాలను  కోరుకునే వారికి ఫిర్నీ, షీర్మాల్‌ వంటివి  ఉంటాయి.
 
‘‘దక్షిణ భారతదేశంలో రంజాన్‌ చివరి మాసంలో ఆహారం అత్యంత ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఈ కమ్యూనిటీ అంతా ఏకం కావడంతో పాటుగా సంయుక్తంగా ప్రార్ధనలు చేయడం, పవిత్ర మాసపు స్ఫూర్తిని అణువణువునా ప్రదర్శించడం, ఉపవాసాన్ని ముగించే సంతోషాన్ని అందరితో పంచుకోవడం కనిపిస్తుంది ’’అని  గోల్డ్‌ డ్రాప్‌,సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, డైరెక్టర్‌ మితేష్‌ లోహియా అన్నారు. రంజాన్‌ మాసంలో ప్రతి రాత్రి మసీదులలో  తరావీ ప్రార్ధనలు చేస్తుంటారు. అవి అద్వితీయ అనుభవాలను అందిస్తాయన్నది నమ్మకం.
 
మత పరమైన అంశాలు మాత్రమే కాకుండా రంజాన్‌ చివరి వారంలో ప్రియమైన వారితో సమయం వెచ్చించడమూ కనిపిస్తుంది. భారీ సమూహాలు ఈ సమయంలో కనిపించడం అసాధారణమేమీ కాదు. మొత్తంమ్మీద దక్షిణ భారతదేశంలో రంజాన్‌ అంటే సంతోషం, వేడుక, సమాజ సేవకు సమయం. ఈ సమయంలోనే ఈ ప్రాంతపు మహోన్నత కలినరీ సంప్రదాయాలూ ప్రదర్శితమవుతాయి. రంజాన్‌ చివరి వారం ప్రియమైన వారిని కలవడం, ప్రార్ధన చేయడానికి, పవిత్రమాసం యొక్క అర్ధాన్ని ప్రతిబింబించడానికి సమయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షయ తృతీయ రోజున.. బంగారం, వెండి ఎప్పుడు కొనాలి..?