Publish Date: Fri, 17 Jul 2015 (21:22 IST)
Updated Date: Fri, 17 Jul 2015 (21:24 IST)
ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీయులు జరుపుకునే పండుగ రంజాన్ లేదా రమదాన్. ఆద్యంతం సేవా తత్పరతను ప్రబోధించే ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన మసీదులలో చేస్తారు.
అనంతరం ఒకరికొకరు 'ఈద్‌ముబారక్ ' (శుభాకాంక్షలు) తెలుపుకుంటారు. ఈ నమాజ్ కోసము వెళ్లే ముస్లిం సోదరులు ఒక దారిన వచ్చి మరో దారిన వెళ్తారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.
ఇంకా రంజాన్ మాసంలో జరిగే ' ఇఫ్తార్ విందు'ల్లో ఆత్మీయత సహృద్భావాలు ప్రస్ఫుటమవుతాయి. పరస్పర ధోరణికి , విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం. ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని ' రంజాన్' సుగమం చేస్తుంది.
తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More