Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం నుంచి ప్రారంభమైన రంజాన్ నెల

Advertiesment
శుక్రవారం నుంచి ప్రారంభమైన రంజాన్ నెల
హైదరాబాద్ (ఏజెన్సీ) , శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (13:04 IST)
ముస్లింల పవిత్రమాసం రంజాన్ శుక్రవారం ప్రారంభమయింది. చంద్రవంక దర్శనంతో రంజాన్ మాసం ఆరంభమయిందని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. శుక్రవారం ఉదయంనుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు (రోజా) ప్రారంభించారు. నగరంలో రంజాన్ మాసం ప్రారంభమయినట్లు తెలిపే సైరన్ మోగటంతో ముస్లింలు మసీదులకు చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ముస్లింలకు పవిత్ర దినం శుక్రవారం. ముస్లిం దేశాలలోవారంలో సెలవుదినంగా శుక్రవారం ఉంటుంది. తమకి పవిత్రదినమైన శుక్రవారంనాడు ముఖ్యమైన రంజాన్ ప్రారంభం కావటం తమకి శుభమని ముస్లింలు భావిస్తున్నారు. మక్కా మసీదులో ఖతీబ్ మౌలానా అబ్దుల్ ఖురేషి పర్యవేక్షణలో ప్రత్యేక ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. జంట నగరాలలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ముస్లింలు చంద్రవంకను దర్శించలేక పోయారు.

Share this Story:

Follow Webdunia telugu