Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముహర్రం పండుగ

Advertiesment
ముహర్రం ముస్లింలు సంవత్సరపు మొదటినెల అరబ్బులు ఇస్లామీయ క్యాలెండర్
ముహర్రం ముస్లింలకు సంవత్సరపు మొదటినెల. నిజానికి ఇది అరబ్బులలో సాంప్రదాయకమైన అరబ్బీ క్యాలెండర్ ప్రకారం మొదటినెల. ప్రాచీన కాలంలోని అరబ్బులు అంటే అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా ఈ క్యాలెండర్‌ను వాడేవారు.

ప్రాచీనకాలంలో అషురా దినం. అనగా ముహర్రం నెలలోని పదవతేదీని పండుగలాగా జరుపుకుంటారు. దీనిని అనేక సాంప్రదాయిక గుర్తులకు అనుగుణంగా పండుగగా జరుపుకుంటున్నారు. ఇస్లామీయ క్యాలెండర్ వాడుకలోకి వచ్చిన తరువాతకూడా పండుగగా జరుపుకొనెడివారు.

కానీ ముహమ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్ ఇబ్న్‌ఆలీ కర్బలా యుద్ధంలో ఇదే నెల పదవరోజున అమరుడైనారు. ఇది పవిత్రమైన యుద్ధంలో అశువులుబాయడంతో వారి జ్ఞాపకార్థకంగా నేడు జరుపుకుంటున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలోని పది రోజులను వర్ధంతిలా జరుపుకుంటున్నారు. దీనిని అమరవీరుల నెలగాకూడా అభివర్ణిస్తారు. షియా ముస్లింలు ఈ ముహర్రంనెలను శోకదినాలుగా గడుపుతారు. వీరు మాతమ్ అంటే శోక ప్రకటన జరుపుతారు.

మన భారతదేశంలో షియాలు ఎక్కువగావున్న ప్రాంతాలలో ముహర్రంను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను పీర్ల పండుగ అనికూడా పిలుస్తారు. ఇందులో హిందువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకోవడం విశేషం.

ఈ పండుగకు తరతమ భేదాలు ఏవీ లేవు. ముహర్రం నెలలోని పది రోజులపాటు జరిగే ఈ పూజాకార్యక్రమాలలో అందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొనడం అందరూ సమానమనేది చాటి చెప్పేదే ఈ పండుగ విశేషం.

ముఖ్యంగా ఈ పదిరోజుల్లో ఎనిమిది, తొమ్మిదవ రోజున అగ్గితొక్కే ఆచారం కూడావుంది. ఇందులోకూడా అన్ని వర్గాల వారు తమతమ కోర్కెలతో పాల్గొనడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu