Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ పాదం మీద గుడ్డపీలికై ధోనన్నా.. వేలానికొస్తే పాడితీరుతా ధోనన్నా: షారుక్

ఒకడు అడవిలో సింహం ఎవరో తేలిపోయిందని ఎకసెక్కాలాడతాడు. మరొకరు చెప్పులు కుట్టి రుణం తీర్చుకుంటా అన్నట్లుగా దుస్తులు అమ్మయినా సరే వేలంపాటలో దక్కించుకుంటా అంటాడు. ఇవి రెండూ రెండు విభిన్న కోణాలు. కానీ ఈ భిన్న కోణాల వెనుక నిలబడిన మేరుపర్వతం మహేంద్ర సింగ్ ధో

Advertiesment
Shah Rukh Khan
హైదరాబాద్ , బుధవారం, 26 ఏప్రియల్ 2017 (07:36 IST)
ఒకడు అడవిలో సింహం ఎవరో తేలిపోయిందని ఎకసెక్కాలాడతాడు. మరొకరు చెప్పులు కుట్టి రుణం తీర్చుకుంటా అన్నట్లుగా దుస్తులు అమ్మయినా సరే వేలంపాటలో దక్కించుకుంటా అంటాడు. ఇవి రెండూ రెండు విభిన్న కోణాలు. కానీ ఈ భిన్న కోణాల వెనుక నిలబడిన మేరుపర్వతం మహేంద్ర సింగ్ ధోనీ. కేప్టెన్సీ అనే పదానికి మారుపేరుగా సమకాలీన క్రికెట్ చరిత్రలో వెలిగిన దుర్నరీక్షుడు ధోనీ. ఒక సీజన్‌లో విఫలమైనంత మాత్రాన జట్టు యాజమాన్యం ఘోరంగా అవమానించి కెప్టెన్ షిప్ నుంచి పెరికి పారేసి అగౌరవం ప్రదర్శించి నవ్వుల పాలైంది. మరోవైపున అదే ధోనీ వేలంపాటకు వచ్చాడంటే వెనకా ముందూ ఆలోచించకుండా తన జట్టులోకి తీసుకుంటా అని ఆరాధన ప్రదర్శించాడు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వేలానికి వస్తే ఎలాగైనా అతడిని దక్కించుకుంటానని అంటున్నాడు బాలీవుడ్ బాద్ షా, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్.  ధోని లాంటి కీలక ఆటగాడు ముందు వేలానికి వస్తే ఎటువంటి ఆలోచనా లేకుండా తన జట్టులోకి తీసుకుంటానన్నాడు. చివరకు తన దుస్తులు అమ్మయినా సరే ధోనిని వేలం పాటలో దక్కించుకుంటానంటూ అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు షారుక్. 'ధోనిని ముందు ఐపీఎల్ వేలం పాటలోకి రానివ్వండి. అతన్ని సొంతం చేసుకోవడం కోసం నా పైజామాలు అమ్మేస్తా. ధోనిని కోల్ కతా నైట్ రైడర్స్ జెర్సీలో చూడాలనుకుంటున్నా. ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలోకి ధోని వస్తే మాత్రం అతన్ని ఎలాగైనా దక్కించుకుంటా' అని షారుక్ పేర్కొన్నాడు. 
 
తోటి సహచరుల్లో కొందరు ధోనీపై అనవసరంగా అపార్థం చేసుకుని ఘర్షణ వైఖరి పెంచుకున్నా, పితూరీల మీద పితూరీలు చెప్పి అతడి స్థాయిని తగ్గించే పనులు చేసినా, భారత్‌లో క్రికెట్ అనే పదానికి అర్థం తెలిసిన తరాలు ఉన్నంతవరకు ధోనీ మహా మేరువులాగే మన ముందు పర్వత ప్రాయంలా కనబడుతూనే ఉంటాడు. ఇది ఆధునిక క్రికెట్‌పై ధోనీ వేసిన రాజముద్ర.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించివాడే ఫినిషర్: ధోనీపై గంభీర్ ప్రశంస