Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆల్ టైమ్ రికార్డుతో దూసుకుపోతున్న ఐపీఎల్: మూడు మ్యాచ్‌లకు 18 కోట్ల వీక్షకులు

పొట్టి క్రికెట్‌గా పేరొందిన టి-20 టోర్నీలు ఆధునిక క్రికెట్ అర్థాన్నే మార్చేశాయి. రోజులు తరబడి, గంటల తరబడి సాగే ఆటకు వేగాన్ని తీసుకొచ్చి కేవలం ఒకటిన్నర గంటలోనే ఒక జట్టు సరకును తేల్చి పడేసే ఉత్కంఠభరిత ఆటగా క్రికెట్‌ను కార్చేసింది టీ-20. ఇప్పటికే టెస్టు

ఆల్ టైమ్ రికార్డుతో దూసుకుపోతున్న ఐపీఎల్: మూడు మ్యాచ్‌లకు 18 కోట్ల వీక్షకులు
హైదరాబాద్ , శనివారం, 15 ఏప్రియల్ 2017 (03:38 IST)
పొట్టి క్రికెట్‌గా పేరొందిన టి-20 టోర్నీలు ఆధునిక క్రికెట్ అర్థాన్నే మార్చేశాయి. రోజులు తరబడి, గంటల తరబడి సాగే ఆటకు వేగాన్ని తీసుకొచ్చి కేవలం ఒకటిన్నర గంటలోనే ఒక జట్టు సరకును తేల్చి పడేసే ఉత్కంఠభరిత ఆటగా క్రికెట్‌ను కార్చేసింది టీ-20. ఇప్పటికే టెస్టు క్రికెట్‌ పట్ల జనంలో ఆసక్తిని చంపేసిన ఈ పొట్టి క్రికెట్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడలలో ముందువరుసలో ఉంది. దేశదేశాలు తమ సొంత ప్రీమియర్ లీగ్‌లను నిర్వహించుకుంటున్నా, భారత్‌లో ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతున్న ఐపీఎల్ కథే వేరు.
 
ఐపీఎల్ కథ ముగిసింది. ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు అంటూ పుకార్లు వ్యాపించిన ప్రతిసారీ గోడకు కొట్టిన బంతిలా నేనున్నానంటూ ఐపీఎల్ సంచలనాలను సృష్టిస్తూనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్ లతో పోలిస్తే ఐపీఎల్లే అగ్రస్థానంలో ఉంది. ఈ ఐపీఎల్  సీజన్‍‌లో ఆ విషయం మరోసారి రుజువైంది.  
 
ఐపీఎల్-10 సీజన్‌లో వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 185.7 మిలియన్ల వీక్షకులు నమోదయ్యారు. దాంతో పాటు ప్రేక్షకుడు మ్యాచ్‌ను చూసే సగటు సమయం 72 నిమిషాలుగా నమోదైంది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. గత సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల వీక్షక్షుల సంఖ్య 160.7 మిలియన్లు కాగా, మ్యాచ్‌ను చూసే సగటు సమయం 46 నిమిషాలు మాత్రంగానే ఉంది. ఈ సీజన్ తొలి వారంలోనే రికార్డు స్థాయిలో వీక్షకులు నమోదు కావడం పట్ల ఐపీఎల్ నిర్వాహకులు ఫుల్ జోష్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 
 
అతి తక్కువ కాలంలోనే ఐపీఎల్ ప్రపంచ అగ్రశ్రేణి క్రీడగా మారడానికి ఎంతో సమయం పట్టదని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్లు అలాంటి క్షణాల్లోనే పుడతారు.. ఘోర ఓటమిని గెలుపుగా మార్చిన పొలార్డ్