Publish Date: Mon, 20 Apr 2015 (07:00 IST)
Updated Date: Mon, 20 Apr 2015 (07:01 IST)
గుజరాత్ సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం రాజస్థాన్ రాయల్ జట్టు మెరుపులు మెరిపించింది. చెన్నై సూపర్ కింగ్సును మట్టి కరిపించింది. 8 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 156 పరుగులు చేసింది.
ఓపెనర్ స్మిత్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫామ్‌ని కొనసాగించాడు. డ్వేన్ బ్రేవో (36 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ సాధించాడు. కెప్టెన్ ధోని (37 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు 18.2 ఓవర్లలో రెండు వికెట్లకు 157 పరుగులు చేసి నెగ్గింది.
ఓపెనర్లు రహానే (55 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్సన్ (47 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు ఏకంగా 144 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.