కెవిన్ పీటర్సన్‌కు కౌంటరిచ్చిన కూల్ కెప్టెన్ ధోనీ.. టెస్టుల్లో నీదే నా తొలి వికెట్.. గుర్తుంచుకో!
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా ప్రశ్నాస్త్రాలు సంధించిన పీటర్సన్ నోటికి పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోన
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచ్ సందర్భంగా ప్రశ్నాస్త్రాలు సంధించిన పీటర్సన్ నోటికి పూణే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కళ్లెం వేశాడు. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా రెండో మ్యాచ్‌లో ముంబై- పూణేలు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి.
తొలుత టాస్ గెలుచుకున్న పూణే కెప్టెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ పగ్గాలు లేకుండా సాధారణ క్రికెటర్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కామెంటరేట్‌గా వ్యవహరించాడు.
ఈ సందర్భంగా మైక్రో ఫోన్ ఛాటింగ్ ద్వారా ధోనీని పీటర్సన్ ప్రశ్నించాడు. మనోజ్ తివారీ, ధోనీల్లో ఎవరు అత్యుత్తమ గోల్ కీపర్ అని అడిగాడు. ఇందుకు ధోనీ కూల్‌గా సమాధానమిచ్చాడు. నిన్ను (కెవిన్ పీటర్సన్)ను పడగొట్టడమే తన తొలి టెస్టు వికెట్ అని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోమని సూచించాడు.