రూ.16కోట్లు నేనడిగానా? డబ్బు కంటే క్రికెట్టే ముఖ్యం: యువీ

శనివారం, 18 ఏప్రియల్ 2015 (12:59 IST)
ఐపీఎల్-8లో ప్రస్తుతం రికార్డు స్థాయి ఫీజు తీసుకుంటున్న క్రికెటర్ యువరాజ్ సింగ్. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ.16 కోట్లు వెచ్చించి యువీని సొంతం చేసుకుంది. ప్రస్తుత సీజన్‌లో జట్టు పరిస్థితి అంతగా ఏం బాగోలేకపోయినప్పటికీ.. యువీ గట్టెక్కిస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. 
 
మరోవైపు తనకు అన్ని కోట్లు ఇమ్మని డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలను యువీ పూర్తిగా ఖండిస్తున్నాడు. "నేనెప్పుడూ అంత ఇమ్మని (రూ.16 కోట్లు) అడగలేదు. అది నా చేతుల్లో లేదు. వేలంలో ఇతర క్రీడాకారుల్లానే నేను ఒకడిని. ఐపీఎల్ లో డబ్బు కన్నా క్రికెట్ ఆడటమే నాకు ప్రధానం" అని యువీ విశాఖలో మ్యాచ్ జరిగిన సందర్భంగా సమాధానమిచ్చాడు.

వెబ్దునియా పై చదవండి