టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ పోరుకు సై అంటున్నాడు. ట్వంటీ-20 వరల్డ్ కప్ సందర్భంగా గాయపడిన యువరాజ్ సింగ్.. ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హైదరాబాదీ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన యువరాజ్ సింగ్.. ఆ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గాయం నుంచి కోలుకున్న యువరాజ్ సింగ్.. గుజరాత్ లయన్స్‌తో మే 6వ తేదీన జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ మేరకు మే 6వ తేదీ జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. మే6న జరిగే మ్యాచ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు యువీ తెలిపాడు. వైద్యులు సైతం శుక్రవారం మ్యాచ్ ఆడేందుకు ఛాన్సులున్నాయని చెప్పినట్లు యువరాజ్ వెల్లడించాడు. ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో తన తొలి మ్యాచ్‌కు ఇంకా సమయం ఉందని.. అప్పటివరకు ఆగలేకపోతున్నానని యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.