Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచింది- లక్నో స్టేడియంలో షాక్!

Advertiesment
Sachin Tendulkar
, మంగళవారం, 16 మే 2023 (13:49 IST)
ఐపీఎల్ సిరీస్‌లో లక్నో-ముంబై జట్లు తలపడుతుండగా శిక్షణలో ఉన్న అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచింది. ఐపీఎల్ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుండగా.. లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో లక్నోలోని ఎకానా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. లక్నో, ముంబై జట్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. లక్నో టీమ్ నిన్న తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో అర్జున్ టెండూల్కర్ లక్నో సహచరులతో మాట్లాడుతూ తన ఎడమ చేతిపై వీధికుక్క కరిచిందని చెప్పాడు. 
 
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ 4 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టి అద్భుతంగా ఆడుతున్నాడు. కుక్క కాటుకు గురైనా నేటి మ్యాచ్ ఆడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాదుడే బాదుడు.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ.. శుభ్‌మన్ గిల్ అదుర్స్