Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2021 ఓ పీడకల: వరుణ్ చక్రవర్తి

Advertiesment
ఐపీఎల్ 2021 ఓ పీడకల: వరుణ్ చక్రవర్తి
, సోమవారం, 11 అక్టోబరు 2021 (12:27 IST)
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తికి ఐపీఎల్ 2021 ఓ పీడకలలా మారింది. ఎందుకంటే.. ఐపీఎల్​ 2021తొలి దశలో అతడికే మొదటగా కరోనా​ సోకింది. అతడి నుంచి వివిధ జట్లలో ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలడంతో మొత్తం లీగ్​నే వాయిదా వేశారు.

కరోనా సోకిన చాలా రోజుల తర్వాత కానీ వరుణ్‌ మహమ్మారి నుంచి కోలుకోలేదు. శారీరకంగా బలహీనంగా ఉండటంతో కోలుకోవడానికి అతడికి చాలా రోజులు పట్టాయి. 
 
ఇక ఆదివారం (అక్టోబరు 10) వరల్డ్​ మెంటల్​ హెల్త్​ డే సందర్భంగా కేకేఆర్​ విడుదల చేసిన వీడియోలో.. ఆ చీకటి రోజులను వరుణ్ మరోసారి గుర్తుచేసుకున్నాడు​. ఐపీఎల్ 2021 నీ వల్లే ఆగిపోయిందని, ​నువ్ చచ్చిపోయుంటే బాగుండేదని పలువురు నెటిజన్లు పోస్టులు చేశారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ అదుర్స్ 0,6,0,4,4,4 బ్యాటింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న చెన్నై ఫ్యాన్ (వీడియో)