Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్‌పై 60 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం_రాయల్స్ అవుట్

రాజస్థాన్‌పై 60 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం_రాయల్స్ అవుట్
, సోమవారం, 2 నవంబరు 2020 (10:26 IST)
దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ నుంచి ఇంటి బాట పట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కోల్‌కతాకు మొదట షాక్ ఇచ్చింది. మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ నితీష్ రానా పెవిలియన్‌కు చేరుకున్నాడు. 
 
కానీ రాహుల్ త్రిపాఠి(39), శుభమన్ గిల్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దరు. ఇక వారు ఔట్ అయిన తర్వాత కోల్‌కత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 35 బంతుల్లో 68 పరుగులు చేయడంతో కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 
 
ఇక రాయల్స్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు, కార్తీక్ త్యాగి 2, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. తర్వాత ఛేజింగ్‌కు దిగిన రాయల్స్‌ మొదటి నుంచి తడబడింది. 
 
కేకేఆర్‌ బౌలర్‌ కమ్మిన్స్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా జౌట్ చేయగా...బట్లర్‌(35), తెవాటియా(31)తప్ప మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేదు. కేకేఆర్‌ బౌలర్లలో కమ్మిన్స్‌ 4, శివమ్‌మావి, వరుణ్‌ చక్రవర్తి తలో 2 వికెట్లు, నాగర్‌ కోటి ఒక వికెట్‌ తీశారు.
 
మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయార్ మోర్గాన్ సిక్స్‌ల మోత మోగించాడు. 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. శుభమాన్ గిల్ (36), రాహుల్ త్రిపాఠి (39), ఆండ్రే రస్సెల్ (25) పరవా లేదనిపించారు. నితీష్ రాణా (0), సునీల్ నరైన్ (0), దినేష్ కార్తీక్ (0) ప్యాట్ కమ్మిన్స్ (15) రాణించలేదు. 
 
కోల్‌కతా జట్టు.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. మొదటి ఓవర్లోనే నితీష్ రాణా డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి.. శుభమాన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
 
ఐతే తొమ్మిదో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది కేకేఆర్. తెవాటియా బౌలింగ్‌లో శుభమాన్ గిల్, నరైన్ ఔటయ్యారు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే త్రిపాఠి, కార్తీక్ ఫెవిలియన్ చేరారు. ఐతే రస్సెల్, మోర్గాన్ 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మళ్లీ రెండు వికెట్లు పడినా.. ఇయాన్ మోర్గాన్ మాత్రం ధాటిగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి 2, శ్రేయాస్ గోపాల్ 1, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశారు.
 
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 22 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 12 సార్లు కేకేఆర్ గెలిచింది. 10 సార్లు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓసారి ఇరుజట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 30న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌ను ఓడించి.. ప్లేఆఫ్స్ బరిలో నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్. 
 
ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు చెరో 14 మ్యాచ్‌లు ఆడాయి. కోల్‌కతా ఏడు మ్యాచ్‌లో గెలిచి మరో ఏడింట ఓడిపోయింది. 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది. ఇక రాజస్థాన్ జట్టు..ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మరో ఎనిమిదింటిలో పరాజయం పాలయింది. 12 పాయింట్లతో అట్టడుగు స్థానానికి వెళ్లిపోయింది. కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది రాజస్థాన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సురేష్ రైనా స్థానంలో రుతురాజ్.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లతో అదుర్స్