ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించి.. ట్రోఫీని గెలుచుకుంది. దీంతో 2013, 2015, 2017, 2019 నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది ముంబై ఇండియన్స్. నాలుగుసార్లూ ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్సీ వహించడం విశేషం.
ఈ నేపథ్యంలో 2019లో గెలుపొందడం ద్వారా పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాలు సంపాదించుకున్న జట్ల ప్రైజ్ మనీ, అవార్డులు వివరాలేంటో ఓసారి చూద్దాం..
1. ఫైనల్‌ల్లో ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌కు రూ.20 కోట్లు
2. రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న చెన్నైకి రూ.12.5 కోట్లు
3. మూడో స్థానం, నాలుగో స్థానంలో నిలిచిన ఢిల్లీకి రూ.10.5 కోట్లు, హైదరాబాద్‌కు రూ.8.5కోట్లు.
4. ఎమర్జింగ్ వీరర్- సుబ్మాన్ గిల్ (కోల్‌కతా నైట్ రైడర్స్) రూ.10లక్షలు
5. సూపర్ క్యాచ్- పొలార్డ్ (ముంబై ఇండియన్స్) రూ. 10 లక్షలు
6. ఆరెంజ్ క్యాప్- డేవిడ్ వార్నర్ (హైదరాబాద్) రూ. 10 లక్షలు
7. పర్పిల్ క్యాప్ - ఇమ్రాన్ తాహిర్ (చెన్నై సూపర్ కింగ్స్) రూ.10లక్షలు
8. గౌరవ క్రికెటర్ - రసల్ (కేకేఆర్) రూ. 10లక్షలు
9. స్టైలిష్ క్రికెటర్ - కేఎల్ రాహుల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) రూ. 10 లక్షలు
10. సూపర్ వాల్యూబుల్ ప్లేయర్ - రసెల్ (కేకేఆర్)
11. గేమ్ ఛేంజర్ - రాహుల్ సహార్ (ముంబై ఇండియన్స్) రూ.10 లక్షలు
12. ఫెయిర్ ప్లే అవార్డు- సన్ రైజర్స్ హైదరాబాద్
13. పిచ్ అండ్ స్టేడియం అవార్డు: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.