Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌లో కోహ్లీ ఆడితే తేలిపోద్ది.. వేలెత్తి చూపితే ఊరుకోం.. ఇంట్లో కూర్చుని రాతలు రాస్తారు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాణించడం కోసమే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ధర్మశాల మ్యాచ్‌కు దూరమైయ్యాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్లాడ్ హాడ్జ్ ఆరోపించాడు. వచ్చేనెల తొలి వారంలో ప్రారంభం కానున్న ఐప

Advertiesment
Australia
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాణించడం కోసమే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ధర్మశాల మ్యాచ్‌కు దూరమైయ్యాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్లాడ్ హాడ్జ్ ఆరోపించాడు. వచ్చేనెల తొలి వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగితేనే విషయం ఏంటో అర్థం చేసుకోవచ్చునన్నారు. గుజరాత్ లయన్స్ కోచ్ అయిన హాడ్జ్ ఇంకా మాట్లాడుతూ... వచ్చే నెల ఐదో తేదీన ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్‌తో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ క్రమంలో కోహ్లీ బరిలోకి దిగితే అంతకంటే నీచం లేదని హాడ్జ్ చెప్పాడు. 
 
మరోవైపు ఆస్ట్రేలియాపై ధర్మశాల మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఆసీస్‌పై 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడం అద్భుతమన్నాడు. ప్రేరణ పొందిన సహచరులు విమర్శకులకు తగిన జవాబిచ్చారన్నాడు. ‘మేం అగ్రస్థానంలో ఉన్నా లేకున్నా ఎవరైనా మమ్మల్ని ఎవరైనా వేలెత్తి చూపితే తిరిగి సమాధానం చెప్తామన్నాడు. ఆస్ట్రేలియా చేసిన విమర్శలపై కూడా కోహ్లీ ధీటుగా సమాధామిచ్చాడు. ఇంట్లో కూర్చుని కొందరు ఇలాంటి రాతలు రాస్తారని.. మైదానంలోకి వచ్చి బ్యాటింగ్, బౌలింగ్ చేస్తే అసలు సంగతేంటో తెలుస్తుందని విమర్శించాడు.
 
టీమిండియా ఏడో ర్యాంకు నుంచి ప్రపంచ నెంబర్‌వన్‌గా అవతరించడం చిరస్మరణీయ అనుభూతి అన్నాడు. ఒక సారథిగా తనకు ఇది గర్వకారణం అని పేర్కొన్నాడు. సిరీస్‌లో ఆస్ట్రేలియా గొప్పగా పోరాడిందన్నాడు. ఐతే కుర్రాళ్లు వెంటనే పుంజుకొన్నారని తెలిపాడు. మైదానం బయట నుంచి మ్యాచ్‌ను చూస్తుంటే ముచ్చటేసిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. సిరీస్ గెలుచుకోవడం ఎంతో హ్యాపీగా ఉందని.. ఈ ఘటన తమ టీమ్ కుర్రాళ్లకే చెందుతుందని చెప్పుకొచ్చారు. కాగా ఐపీఎల్ తొలి వారంలో కోహ్లీ ఆటకు దూరమయ్యే ఛాన్సుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాదులో తలడనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మశాల టెస్టులో భారత్‌దే గెలుపు.. 2-1 తేడాతో సిరీస్ కైవసం.. ర్యాంకింగ్స్‌లో ఇండియానే నెం.1